‘మెటో’ స్మార్ట్‌కార్డుపై 10 శాతం రాయితీ


ఎల్ అండ్ టి ప్రకటన

వచ్చే మార్చి వరకు మెట్రోరైలు ప్ర యాణికులకు ఎల్ అండ్ టి 10 శాతం రాయితీని ప్రకటించింది. ఈ ఆఫర్‌తో పాటు పేటీఎం ద్వారా మొట్టమొదటిసారిగా రూ. 100 లేదా ఆ పైన స్మార్ట్‌కార్డుపై రీచార్జ్ చేసుకుంటే, రూ.20 నగ దు వెనక్కి ఇవ్వనున్నారు. స్టేషన్‌లలో ఉండే టిక్కెటింగ్ కౌంటర్‌ల నుంచి స్మార్ట్‌కార్డులు కొనుగోలు చేస్తే, ఏదైనా మెట్రో స్టేషన్‌లో వా టిని రీచార్జ్ చేసుకోవచ్చు. టీవారీ యాప్, పేటీఎం, హెచ్‌ఎంఆర్ పాసెంజర్ వెబ్‌సైట్, స్టేషన్ కాంకోర్స్ ఏరియాపై ఉన్న పెయిడ్ ఏరియాలోని యాడ్ వాల్యూమెషీన్ ఉపయోగించి, స్మార్ట్‌కార్డులను రీచార్జ్ చేసుకోవచ్చు. మెట్రోరైళ్లలో ప్రయాణించడానికి స్మార్ట్‌కార్డు లేదా టోకెన్ ప్రయాణికులు ఉపయోగించవచ్చు. . ప్రయాణికుల కోసం తాగునీటి డిస్పెన్సింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. కాంకోర్స్ వద్ద అన్‌పెయిండ్ ఏరియాలో రెస్ట్‌రూమ్స్ అందుబాటులో ఉన్నాయని ప్రకటనలో పేర్కొంది. రెస్ట్‌రూమ్‌లను వినియోగించుకునేందుకు కాంకోర్స్‌లోని ఒక వైపు నుంచి మరో వైపునకు వెళ్లేందుకు స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం కేటాయించిన ప్రాంతాలతో పాటు నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, రసూల్‌పుర, బాలానగర్, కూకట్‌ప ల్లి, మియాపూర్‌ల దగ్గర ప్రయాణికుల సౌకర్యార్థం పార్కింగ్ సదుపాయాలు ఉన్నాయని ఎల్ అండ్ టి పేర్కొంది.

Comments