లారీ-వ్యాన్ ఢీ:
10 మంది మృతి
చెన్నై: తమిళనాడు రాష్ట్రం తిరుచ్చిలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-వ్యాను ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యాత్రికులు కన్యాకుమారి నుంచి వ్యానులో తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులు కన్యాకుమారికి చెందిన కుటుంబంగా పోలీసులు గుర్తించారు.

Comments
Post a Comment