ఆధార్ లింక్ గడువు మార్చి 31వరకు..!

ఆధార్ లింక్ గడువు మార్చి 31వరకు..!
ఆధార్ లింక్ గడువును మార్చి 31వరకు పొడిగిస్తాం..!

న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్, బ్యాంకు అకౌంట్లు, ఇతర సేవలతో ఆధార్ అనుసంధానం చేసే గడువును మార్చి 31వరకు పొడిగిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఆధార్ లింక్ చేయడంపై గడువు ముగియనున్న నేపథ్యంలో.. తాత్కాలిక ఉపశమనం కోసం గడువును పొడిగించాల్సిందిగా పిటిషనర్లు కోరుతున్నారని వారి తరుపు న్యాయవాది శ్యామ్ దివన్ కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్, బ్యాంకు అకౌంట్లకు ఆధార్ లింక్ గడువును పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కేకే వేణుగోపాల్ త్రిసభ్యధర్మాసనం ముందు వెల్లడించారు. మొబైల్ వినియోగదారులు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6లోగా తమ మొబైల్ ఫోన్ నంబర్లు ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Comments