షియోమీ నూతన స్మార్ట్‌ఫోన్లు విడుదల

షియోమీ నూతన స్మార్ట్‌ఫోన్లు విడుదల



రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్లస్


షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్లస్‌లను చైనా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. భారత్‌లోనూ ఈ ఫోన్లు త్వరలో లభ్యం కానున్నాయి. 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ రూ.7,795, రూ.8,770 ధరలకు లభ్యం కానుండగా, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన రెడ్‌మీ 5 ప్లస్ రూ.9,745, రూ.12,675 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు...


5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.
Xiaomi-Redmi-5

షియోమీ రెడ్‌మీ 5 ప్లస్ ఫీచర్లు...


5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments