- Get link
- X
- Other Apps
పక్కా ప్రణాళికతోనే.. ఎన్కౌంటర్
మేడిగడ్డ ప్రాజెక్టుకు 20 కి.మీ దూరంలో ఘటన
ఎన్‌కౌంటర్‌కు ముందు కాళేశ్వరం వద్దకు రాష్ట్ర డీజీపీ
ఎన్‌కౌంటర్‌కు ముందు కాళేశ్వరం వద్దకు రాష్ట్ర డీజీపీ
ఉత్తర తెలంగాణ సరిహద్దుల్లో చాలా రోజుల తర్వాత తుపాకుల మోత పుట్టించాయి. భూపాలపల్లి జిల్లా కు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా సిరోంచి తాలుకాలో జరిగిన ఎన్కౌంటర్ చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఏటూరునాగారం, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణాలకు ఉన్న సెక్యూరిటీ వ్యవస్థపై ఇటీవల డీజీపీగా బాధ్యతలు చేపట్టిన మహేందర్‌రెడ్డి దృష్టిని సారించారు.కాగా కాగా నెల రోజుల కిందట భూపాలపల్లి జిల్లాలో చాలా కాలం తర్వాత పోలీసుల కూంబింగ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల మందుపాతరలు బయటపడ్డాయి. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టుల ద్వారా పోస్టర్లు కూడా వెలువడం పోలీసు ఉన్నతాధికారుల్లో ఆందోళనకు దారి తీసింది. అదే సమయంలో భూపాలపల్లిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సానుభూతిపరులుగా పోలీసులు విశ్వసించే వారితో పాటు ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు అటవీ, రెవిన్యూ , పోలీసు అధికారులు జోక్యం చేసుకుని వ్యూహం ప్రకారమే వారందరిపై చర్యలు తీసుకున్నారు. గొత్తి కోయలను బలవంతంగా అక్కడి నుంచి బయటికి పంపించి వేయడం జరిగింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించాలని నిర్ణయించడంతో ఉత్తర తెలంగాణ పోలీసు యంత్రాంగం మావోయిస్టుల కదలికలపై మరింతగా అప్రమత్తం అయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి , వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు దానికి ఆనుకుని నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి సెక్యూరిటీ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నేపథ్యంలోనే గడ్చిరోలీ జిల్లాలో, రాష్ట్ర సరిహద్దుల్లోనూ మావోయిస్టుల కదలికలు సాగుతున్నట్టు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగానికి కీలకమైన సమాచారం అందినట్టు తెలిసింది. ఈ మేరకు మహారాష్ట్ర నిఘా విభాగానికి సమాచారాన్ని ఇవ్వడంతో రాష్ట్ర సరిహద్దుల్లోని సిరోంచి తాలుకాలో ఏడుగురు మావోయిస్టుల ఎన్కౌంటర్ పక్కాప్లాన్డ్గా జరిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన షెడ్యూల్ ఖరారు అయినప్పటి నుంచి ఆయన పర్యటనపై కొంత టెన్షన్లో ఉన్న ఉత్తర తెలంగాణ పోలీసులు తాజా ఎన్‌కౌంటర్‌తో కొంత ఊపిరి పీల్చుకున్నట్టు ఖాకీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సెక్యూరిటీపై ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ అంజనీకుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, వరంగల్ రేంజ్ డీఐజీ రవివర్మ, ఐజీ నాగిరెడ్డిలతో సమీక్షించినట్టు తెలిసింది.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment