- Get link
- X
- Other Apps
ప్రేమజంట ఆత్మహత్య
ఏడాది కాలంగా వారిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఈ విషయం పెద్దలకు చెప్పారు. వారిద్దరి మధ్య కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో ప్రేమజంట మనస్థాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఉదంతం ఆదిలాబాద్‌లో చోటు చేసుకున్నది. ఆదిలాబాద్ మండలంలోని దుబ్బగూడకు చెందిన ముఖేష్(25), టైలర్స్ కాలనీకి చెందిన కల్యాణి (21)ల మధ్య పరిచయం ఏర్పడి క్రమంగా ప్రేమగా మారింది. గత ఏడాది కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ముఖేష్ ప్రైవేట్ జీపు డ్రైవర్‌గా పని చేస్తుండగా.. కల్యాణి ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. వీరి ఇద్దరి కులాలు వేరు. ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో గతంలో ముఖేష్‌ను కల్యాణి తండ్రి మందలించినట్లు తెలిసింది. కొంత కాలం వారు దూరంగా ఉంటున్నట్లు వ్యవహరిస్తు ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు ఇరువర్గాల కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ క్రమంలోనే తాము పెళ్లి చేసుకుంటామని వారివారి పెద్దలను కోరగా.. కులాలు వేరు కావడంతో వ్యతిరేకించారు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట మంగళవారం రాత్రి ఇండ్ల నుంచి వెళ్లిపోయారు. రాత్రి కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించారు. ఆ తర్వాత బందువులను సైతం ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాత్రి వరకు ఇంటికి రాక పోవడంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం టైలర్స్ కాలనీ శివారు నుంచి వెళ్లే రైల్వే పట్టాలపై ఈ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఉదాంతం వెలుగులోకి వచ్చిం ది. దీంతో ఇరువర్గాల కుటుంబ సభ్యులు కన్నీరు ము న్నీరయ్యారు. రాత్రి ఏ వేళనో రైలు కిందపడి ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది.ఈ మేరకు రైల్వే, రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment