అర్జున్ కపూర్‌పై దాడి

ముంబయి: బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. సినిమా సెట్‌లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి అర్జున్‌పై దాడికి పాల్పడ్డాడు. ఘటన వివరాల్లోకి వెళితే… అర్జున్ ప్రస్తుతం సంజయ్ ఔర్ పింకీ ఫరార్ మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో జరుగుతోంది. చిత్ర యూనిట్ ఓ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో కమల్ కుమార్ అనే వ్యక్తి మద్యం సేవించి సెట్‌కి వచ్చాడు. హీరో అర్జున తన వ్యానిటీ వ్యాన్‌లో ఉన్నాడని తెలుసుకుని షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి వెళ్లాడు. కానీ అర్జున్ షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో చెయ్యి మెలితిప్పి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే కమల్‌ను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇక ఈ మూవీలో అర్జున్‌కు జోడీగా పరిణీతి చోప్రా నటిస్తుండగా, దివాకర్ బెనర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

Arjoon-Kapoor

Comments