- Get link
- X
- Other Apps
రాజకీయంగా బలపడేందుకు బీజేపీ కుట్ర
ఆరువామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఢిల్లీలో 'బ్లాక్‌డే'
దేశంలో రాజకీయంగా బలపడేందుకు హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు సృష్టించేందుకు బీజేపీ యత్నిస్తోందని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. హిందు, ముస్లిం, సిక్కు, క్రైస్తవులు దేశానికి నలుగురు సైనికులని, ఈ సైనికుల మధ్య ఐక్యతను దెబ్బతీయలన్న బీజేపీ ప్రయత్నాలను వామపక్షాలుగా తిప్పికొడతామని ఏచూరి అన్నారు. ప్రజాస్వామ్య భారతదేశాన్ని కరుడుగట్టిన హిందూరాష్ట్రంగా మార్చాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శించిన ఏచూరి... ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు. ఆరు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో 'బ్లాక్‌డే'గా పాటించారు. అందులో భాగంగా మండిహౌస్ నుంచి పార్లమెంట్ స్ట్రీట్ వరకు ర్యాలీ చేపట్టారు. సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్, హన్నన్‌మొల్లా, సీపీఐ కార్యదర్శి డీ రాజా, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ సభ్యులు కవితాకృష్ణన్ తదితరులు ర్యాలీ అగ్రభాగన నడిచారు.

Comments
Post a Comment