అవినీతి నిర్మూలనతోనే అభివృద్ధి

అవినీతి నిర్మూలనతోనే అభివృద్ధి

కలెక్టరేట్:అవినీతి నిర్మూనలతో సమాజాభివృద్ధి సాధ్యమని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పేర్కొన్నారు. అవినీతి నిర్మూలన వారోత్సవాలను పురసకరించుకొని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ అవినీతి రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒ క్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారత్ అభివృద్ది చెందుతున్న దేశమని, మానవ వనరులు, సహ జవనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. వీటిని వినియో గించుకున్నపుడే సమాజం సుసంపన్నమవుతుందన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి వెచ్చిస్తున్న సొమ్ములో ప్రతి రూపాయికి కేవలం 40 పైసలు మాత్రమే అర్హులకు అందుతుందని మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. పాలకులు సంక్షేమ పథకాలకు విడుదల చేస్తున్న నిధుల్లో వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా అవినీతిపై ముద్రించిన కరపత్రాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. పోలీస్ కమీషనర్ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతిని అంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సమాజంలో అవినీతి రెండు రకాలుగా ఉంటుందని, ఒకటి లంచాలు, రెండోది మార్కెట్‌లో తూకంలో, ధరల్లో ప్రజలను మోసగించడం లాంటివివన్నారు. ప్రజలు వీటిపట్ల అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాల న్నారు. 

Comments