అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి
రోడ్డు ప్రమాదంలో మరణించిన కుత్బుల్లాపూర్ సూరారం నివాసి తులసీరామ్
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. మృతుడు కుత్బుల్లాపూర్ సర్కిల్ సూరారం ప్రాంతానికి చెందిన జాకబ్ కుమారుడు నాగ తులసీరామ్ (26)గా గుర్తించారు. తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలోమృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో చనిపోయినట్లు ఫోన్ వచ్చిందని వివరించారు. నాగ తులసిరామ్ రెండు సంవత్సరాల క్రితం ఎంఎస్ చదివేందుకు యూఎస్‌ఎలోని బ్రిడ్జిపోర్ట్ యూనివర్సిటీలో చేరాడు. వాటర్‌బరీలో నివాసం ఉండే వాడని చెప్పారు. తన కుమారుడి ఆచూకీ కోసం తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని జాకబ్ కన్నీటిపర్వంతమయ్యారు.ఈ విషయంపై ఎమ్మెల్యే వివేకానంద్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేయగా ఆయన మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై తల్లిదండ్రులు ఆరా తీస్తున్నారు.
Comments
Post a Comment