- Get link
- X
- Other Apps
పత్తి పంట
పొడగింపు వద్దు
తెలంగాణ జిల్లాలో ఎక్కువగా రైతులు పత్తి పంటను సాగుచేస్తారు. ఈ ఏడాది వానాకాలంలో జిల్లావ్యాప్తంగా రైతులు ఎక్కు వ విస్తీర్ణంలో పంటను సాగు చేశారు. పంట చేతికి వచ్చే దశలో గులాబీ పురుగు రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండిం చిన పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ప్రభావం వచ్చే సం వత్సరం ఉండకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పంటను పొడగించకుండా జా గ్రత్త వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల చివరి కల్లా పంటను తీసేసేలా అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో పత్తి పం టను ఎక్కువగా సాగుచేస్తారు. ఈ సీజన్‌లో పంట విస్తీర్ణం పెరిగింది. సీజన్ ప్రారంభం నుంచి వానలు కురియడం, రైతులకు సకాలంలో వి త్తనాలు, ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచడంతో పంటలు ఏపుగా పెరిగాయి. ఈ దశలో పంటపై గులాబీ రంగు పురుగు ప్రభావం చూ పడంతో రైతులు ఆందోళన చెందారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ పురుగు ప్రభావం లేకుండా చర్యలు చేపట్టారు.
ప్రమాదం తప్పిందకున్న రైతులకు పంట దిగుబడులు ప్రారంభమైన 20 రోజుల తర్వాత అక్టోబర్ చివరి వారంలో మరోసారి పత్తి పంటను గు లాబీ రంగు పురుగు ఆశించింది. బేల, జైనథ్, తాంసి, తలమడగు, భీంపూర్, ఆదిలాబాద్, మావల మం డలాల్లోని పత్తి పంటపై ఈ పురుగు ఎక్కువ ప్రభా వాన్ని చూపింది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్ట పోవాల్సి వచ్చింది. ప్రమాదకరమైన తల్లి పురుగు పం టలోని లేత ఆకుల కింద, లేత కొమ్మలపైన, పూల మొగ్గలపైన, లేతకాయలపైన గుడ్లు పెడుతుంది. ఈ పురుగు జీవితకాలం 45 రోజులుండగా.. గుడ్ల నుంచి పొదగబడిన పిల్ల పురుగులు పూల మొగ్గలోనికి తొ లుచుకుపోయి లోపలి పదార్ధాలను తిని గడ్డి పూలు గా మారుస్తాయి. చిన్న లార్వాలు కాయలకు కనిపించ నంత రంధ్రాలను చేసి లోనికి ప్రవేశిస్తాయి. కాయల కు చేసిన రంధ్రం పూడిపోయి పురుగు కాయలోనే ఉండి గింజలను తింటూ దూదిని బాగా నష్టప రుస్తుంది. ఫలితంగా దూది నాణ్యత లేకుండా పోవడ మే కాకుండా బరువు సైతం గణనీయంగా తగ్గింది. పత్తి సాధారణంగా ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. ఈ సారి చాలా తగ్గాయి. వివిధ మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దూది విచ్చుకునే దశ లో పురుగు ప్రభావం కనపడడంతో రైతులు పంటను తగులబెట్టారు

ముందస్తు చర్యలు
జిల్లాలో పత్తి పంటపై గులాబీ రంగు పురుగు ఉధృ తి ఎక్కువగా ఉండడంతో వచ్చే ఏడాది పురుగు ప్రభా వం ఎక్కువగా ఉండి నష్టం సైతం తీవ్రంగా ఉండే ప్ర మాదం ఉంది. పురుగును నివారించేందుకు ఉన్న తాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడా ది కూలీల కొరత కారణంగా పత్తి ఏరడంలో జాప్యం జరిగింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో పత్తి ఏర కుండానే ఉంది. సాగునీరు సౌకర్యం ఉన్న రైతులు పంటను నెల నుంచి 45 రోజుల పాటు పొడగించే అవకాశాలున్నాయి. ఫలితంగా పంటకు సోకిన పురు గు బతికి ఉండే వచ్చే ఏడాది పత్తిపై ఆశించే ప్రమాదం ఉంది. గులాబీ రంగు పురుగు పత్తి పంటపైనే ఆశించే అవకాశాలున్నాయి. దీంతో ఈ పంటను పూర్తి స్థాయి లో తొలగించి పురుగు బతికి ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో డిసెంబర్‌లో పంటను పూర్తి స్థాయిలో తీసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నీటి సౌకర్యం ఉన్న రైతులు శనగ, గోధుమ, నువ్వు, వేరుశనగ ఇతర పంటలు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతు సమన్వయ సమి తుల సహకారంతో వ్యవసాయ క్లస్టర్ల వారీగా రైతుల తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించనున్నారు.- Get link
- X
- Other Apps
Comments
Post a Comment