- Get link
- X
- Other Apps
ముందస్తు హెచ్చరిక రాలేదు
ఓఖీ తుఫాన్‌పై కేరళ సీఎం పినరరు విజయన్
తిరువనంతపురం: ఓఖీ తుఫాన్‌పై కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలూ జారీ కాలేదని కేరళ ముఖ్యమంత్రి పినరరు విజయన్ అన్నారు. నవంబరు 30కు ముందు కేంద్రం నుంచి ఫోన్లోగానీ, ఈమెయిల్లోగానీ తుఫాన్ హెచ్చరికల సమాచారం రాష్ట్రానికి రాలేదని ఆయన విమర్శించారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...''ఓఖీ తుఫాన్ రాకపై జాలర్లు సముద్రంపైకి వెళ్లవద్దని మాత్రమే భారత వాతావరణ శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా నవంబరు 30న మధ్యాహ్నం 2 గంటలకు కేంద్రం నుంచి సమాచారమందింది'' అని చెప్పారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్ని ఓఖీ తుఫాన్ అతలాకుతలం చేసింది. ఇంతటి భీకర తుఫాన్ వస్తే..కేంద్ర ప్రభుత్వం అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నది. రాష్ట్రాలకు ముందే సమాచారం అందించామని, రెస్క్యూ ఆపరేషన్‌పై రాష్ట్రాలు ముందస్తు ఏర్పాట్లుచేసుకోలేదని కేంద్రం చేతులు దులుపుకుంది. అలాంటి ముందస్తు సమాచారమేదీ రాలేదని కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు చెప్పినా స్పందించటం లేదు. ఇప్పటికీ ఈ విషయాన్ని పినరరు విజయన్ రెండుమార్లు ప్రస్తావించారు. గత 100 ఏండ్లలో కేరళ ప్రజలు ఎదుర్కొన్న భీకర తుఫాన్ ఇదేనని, సముద్రంలో 92 మంది కేరళ జాలర్లు గల్లంతయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోస్ట్‌గార్డ్, వైమానిక, నావికా దళాలతో జాలర్ల కోసం వెతుకులాటను ఉధృతం చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment