- Get link
- X
- Other Apps
ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెం
వాషింగ్టన్: పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న చిచ్చును మరింత రెచ్చగొట్టేలా.. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ బుధవారం ప్రకటన వెలువరించారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడమనేది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమని ట్రంప్ వ్యాఖ్యానించారు. జెరూసలెంను పాలస్తీనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు, ఇజ్రాయెల్‌లోని యూదులు, వివిధ దేశాల్లోని క్రైస్తవులు అత్యంత పవిత్ర ప్రదేశంగా భావిస్తుంటారు. ఈ విధంగా మూడు మతస్థులకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఏకపక్షంగా ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించటం అంటే.. మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదుపటమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించటమేగాక, ఇప్పటికే ఆ దేశ రాజధానిగా ఉన్న టెల్‌అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించటానికి కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారని వైట్‌హౌస్ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. అమెరికా నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నేరుగా స్పందించేందుకు నిరాకరించారు. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించినట్లుగా వార్తలు వెలువడ్డాయి.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment