- Get link
- X
- Other Apps
సీబీఐటీ, ఎంజీఐటీ విద్యార్థుల ఆందోళన
కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ రంగా రెడ్డి జిల్లా గండిపేట మండంలోని సీబీఐటీ, ఎంజీఐటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. కాలేజీ ఎదుట బైటాయించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఓయూ విద్యార్థులు మద్దతు తెలిపారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ... ఈఏడాదికి ఏకంగా రూ.2లక్షల వరకు ఫీజు పెంచడం దారుణ మన్నారు. యాజమాన్యం దిగొచ్చే వరకూ రోజుకో విధంగా కాలేజీ ఎదుట ఆందోళ న చేస్తామన్నారు. అయినా యాజమాన్యం స్పందించకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టేందుకు నార్సింగి పోలీసులు యత్నించారు. ఒక్క విద్యార్థి కూడా అక్కడ నుంచి లేవకుండా శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. కాలేజీ యాజమాన్యంతో నార్సింగి పోలీసులు కుమ్మక్కయ్యారని విద్యార్థులు ఆరోపించారు.
విద్యార్థుల ధర్నాకు ఎస్ఎఫ్ఐ మద్దతు
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) ఫీజు పెంచడం తగదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) హెచ్చరించింది. పెంచిన ఫీజులు చెల్లించలేమని విద్యార్థులు చేపట్టిన ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు, కార్యదర్శి కోట రమేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఫీజు సరిపోవడం లేదని అధిక ఫీజులు వసూలు చేసుకునేందుకు కోర్టు ద్వారా సీబీఐటీ అనుమతి పొందిందని తెలిపారు. టీఏఎఫ్ఆర్సీ ఆమోదిస్తే వచ్చే విద్యాసంవత్సరం నుంచి పెంచిన ఫీజులు వసూల చేయాలని డిమాండ్ చేశారు. కోర్టు అనుమతి పేరుతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదని తెలిపారు.

Comments
Post a Comment