ప్రపంచంలో రెండో అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా తాజ్!

ప్రపంచంలో రెండో అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా తాజ్!

ఓ సర్వేలో వెల్లడి 
taj-mahal 
న్యూఢిల్లీ: ప్రేమసౌధం.. తాజ్‌మహల్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ట్రిప్‌అడ్వైజర్ అనే ట్రావెల్ వెబ్‌సైట్.. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు నిర్వహించిన సర్వేలో తాజ్‌మహల్‌కు రెండో స్థానం లభించింది. తొలిస్థానంలో కంబోడియాలోని ఆంకోర్‌వాట్ టెంపుల్ నిలిచింది. వాస్తవిక మనోహరమైన నిర్మాణశైలి, చరిత్ర ఆధారంగా ఆంకోర్‌వాట్‌కు మొదటి స్థానం లభించిందని తెలిపింది. మూడో స్థానంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, తర్వాతి స్థానాల్లో పెరూలోని మాచుపిచ్చు(పెరూ), ఇగువాజు పార్క్ (బ్రెజిల్) నిలిచాయి.

Comments