అదనపు ఫీజులు సరికాదు: కడియం

అదనపు ఫీజులు సరికాదు: కడియం

 హైదరాబాద్: కాలేజీ యాజమాన్యాలు విద్యాసంవత్సరం మధ్యలో అదనపు ఫీజులు వసూలు సరికాదని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. సిబిఐటి కాలేజీ ఘటనపై కడియం స్పందిస్తూ…. ఇంజినీరింగ్ కాలేజీ ఫీజులు ఎఫ్‌ఆర్‌సి నిర్ణయిస్తుందని చెప్పారు. కమిటీ నిర్ణయించిన ఫీజు ప్రకారమే జివొ ఇచ్చామని, కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని, కోర్టు అనుమతిని సపోర్ట్ చేస్తూ… ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని వివరించారు. ప్రభుత్వం అనుమతి లేకుండానే కాలేజీలు ఫీజులు వసూలు చేయడం సరికాదని, అప్పిల్‌కు వెళ్లి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందన్నారు.

Comments