- Get link
- X
- Other Apps
బీసీ సబ్‌ప్లాన్ వస్తుందా?
ఈ కాలంలో వెనుకబడిన తరగతులకు సంబంధించి ముందుకొచ్చిన ప్రధాన సమస్య 'బీసీ సబ్‌ప్లాన్'. వామపక్షాల చొరవతో అనేక మంది మేధావులతో ఏర్పడిన బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాపిత ఆందోళనలు జరిగాయి. ఎంబీసీ సంఘం ఏర్పడి పోరాడుతున్నది. ఫలితంగానే ప్రభుత్వం ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో బీసీ సబ్‌ప్లాన్ గానీ, ఎంబీసీలు, సంచార జాతుల గురించి గానీ చర్చనీయాంశం చేసింది వామపక్షాలే. వీటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయటం ఆహ్వానించదగిందే. కానీ ఈ విషయాలకు సంబంధించి ప్రధాన భాగస్వాములైన వామపక్షాలను విస్మరించి, చర్చను ప్రజా ప్రతినిధులతో సంప్రదింపులకు పరిమితం చేయటంలోనే పాలకుల చిత్తశుద్ధి ప్రశ్నార్థకమైంది. ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలు చట్టసభల్లో చెప్పే అవకాశం ఉంది. తమతో ఏకీభవించే వారితోనే సంప్రదింపులన్న పద్ధతి పాటిస్తున్నదీ ప్రభుత్వం. శాస్త్రీయ ప్రతిపాదనల పట్లగానీ, శాశ్వత పరిష్కారాల పట్ల గానీ విముఖత చూపుతున్నది. ప్రజాస్వామ్య ప్రక్రియలకు నీళ్లొదులుతున్నది. పాలకులు వామపక్షాలను విస్మరిస్తారు. విపక్షాలు పట్టించుకోవు. కీలకాంశాలు చర్చకు రాకుండా, సంప్రదింపుల తతంగాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఓటర్లను ఆకర్షించే ప్రక్రియగా వాడుకోవటమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment