- Get link
- X
- Other Apps
ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదించిన యూపీ
ముసాయిదా బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా రికార్డు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపిన తొలి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం కేంద్రం తెచ్చిన బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం మూడుసార్లు తలాక్ (తలాక్-ఏ-బిద్దత్) చెప్పి భార్యకు విడాకులిచ్చే వ్యక్తులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తారు. మూడేండ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని ఆగస్టు 22న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్రం చట్టం తీసుకురావాలని సూచించింది. ఆ మేరకు ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు పేరిట ముసాయిదా బిల్లును రూపొందించిన కేంద్రం... దీనిపై డిసెంబర్ 10వ తేదీలోగా తమ అభిప్రాయాలను తెలుపాల్సిందిగా ఆయా రాష్ర్టాలకు సూచించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ ముసాయిదా బిల్లు పార్లమెంటు ముందుకు రానున్నది.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment