*వైన్స్ షాప్ యజమానికి 5వేల జరిమానా*

*వైన్స్ షాప్ యజమానికి 5వేల జరిమానా*

*సమయజ్యోతి ఆసిఫాబాద్ ప్రతినిధి*


కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  సిర్పూర్ టి మండల కేంద్రంలో మీనాక్షి వైన్స్ యజమానికి సిర్పూర్ ఎంపిడిఓ జగదీష్ ఐదు వేల రూపాయల జరిమానా వేశారు. వైన్స్ నిర్వాహకులు తమ షాపులో ప్లాస్టిక్ గ్లాసుల తో పాటు పాలితిన్ కవర్లను ఉంచడంతో వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు సంబంధిత దుకాణదారులు కి ఐదువేల రూపాయలను జరిమానా విధించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలితిన్ నిషేధించాలని కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో దుకాణదారులు కవర్ల వినియోగాన్ని చేపట్టడం సరైంది కాదన్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా ప్రతి ఒక్కరూ నితిన్ కవర్ల వాడకాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. మండల వ్యాప్తంగా ఎవరైనా పాలితిన్ కవర్ల విక్రయాలు గాని వాడకాలు గాని చేపట్టినట్టు అయితే వారిపై తగు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Comments