అక్రమంగా తరలిస్తున్న బెల్లం వాహనాన్ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు*.... *ఇద్దరి అరెస్ట్ రిమాండ్కు తరలింపు
*అక్రమంగా తరలిస్తున్న బెల్లం వాహనాన్ని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు*.... *ఇద్దరి అరెస్ట్ రిమాండ్కు తరలింపు*
*సమయజ్యోతి కొమరం భీమ్ జిల్లా ప్రతినిధి*
మహారాష్ట్ర గోండి పిప్పిరి నుంచి కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం లంబాడి ఎట్టి గ్రామానికి అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని బుధవారం కాగజ్ నగర్ ఎక్సైజ్ సిఐ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకున్నారు. బొలెరో పికప్ వాహనంలో మహారాష్ట్ర నుండి రెండువేల ఎనిమిది వందల కిలోల బెల్లం తో పాటు నాలుగు కిలోల పట్టికను వారు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తుగా అందిన సమాచారం మేరకు మాటువేసి వాహనాన్ని తమ అదుపులోకి తీసుకొని పరిశీలించగా బెల్లము మరియు పటిక లభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తెలంగాణలోని ప్రతి ఎక్సైజ్ శాఖ పరిధిలో తనిఖీలు చేపడుతున్నామని , వీటిని గమనించిన కొంతమంది వ్యాపారులు మహారాష్ట్ర నుండి బెల్లాన్ని అక్రమంగా రవాణా చేస్తూ సారాయిని తయారు చేస్తున్నారని ఆయన అన్నారు. నిషేధిత మద్యం తయారీకి ఎవరైనా పాల్పడినట్లు అయితే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన అటువంటి బొలెరో వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు రవాణా చేస్తున్న అజ్మీరా శ్రీకాంత్, జర్పుల శంకర్ లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు .
Comments
Post a Comment